Wednesday, January 3, 2007

సంపూర్ణ చతుర్ధ సర్గ

వానర ప్రముఖుడు, తేజోవంతుడు
అతిబలశాలియగు వాయు నందనుడు
ఒక్క గుద్దుతో లంఖిణిని పరిమార్చి
కోట గోడపై దుమికి ఎక్కెను 1

ఎడమ పాదమును లంకన నిలుపుతు
ఆకాంక్షించెను సుగ్రీవ విజయము,
సఫల కార్యము. రాత్రి సమయము
ఎవరికి కానక, మెల్ల మెల్లగా,
ముత్యములు పూలతో అలంకరించబడి
చంద్రుని కాంతితో వెలిగిపోవుచున్న
వీధుల తిరుగుచు, రాజ ప్రాసాదము
వైపుకు హనుమ పయనమయ్యెను 4

గల గల యను నవ్వులతోనూ,
వివిధ వాద్యముల ఘొషల తోనూ,
కన్నులు చెదరు కాంతులతోనూ,
వజ్రములు పొదిగిన కితికీలతోనూ
నిండిన భవన సముదాయములతో
ఆకాశ హార్మ్యమువలె
అగుపడె లంకా నగరము.
స్వస్థిక, పద్మము మొదలగు
పవిత్ర ఆకారములలో నిర్మిత భవనములతోనూ
మేలు జాతి అస్వ సమూహములతోనూ
లంకా నగరము మెరయు చుండెను 7

రామ కార్యము నెరవేర్చుటకు
సుగ్రీవాజ్ఞను పాలిచుటకును
సుందర లంకను గాలించుటకు
అటునిటు తిరిగెను, వాయు నందనుడు 8

ఒక భవనమును చూసిన పిమ్మట
వేరొక భవంతిపై హనుమ ఎగిరెను
వివిధ భవనములూ, వింత ఆకృతులు
దేనికి అదియే సాటి అందమున 9

సుందర సుస్వర మధుర గానము
మంద్రము మధ్యమ తారా స్థాయిలలో
ప్రేమతో నిండిన అప్సర స్త్రీ గానము
ఇంతలో వినిపించె వడ్డాణ ధ్వానము, 10
దానితో విన వచ్చె అడుగుల సవ్వడి
అటునిటు వచ్చెను చప్పట్ల ద్వని
అంతలో వినిపించె వీరుల కేకలు 11
ఇంతలో పవిత్ర మంత్ర ఘోషలు
రాక్షస వేద పఠనా ఘనాపాటలు
రావణ విశేష గుణ గానము 12
స్త్రీల ఆభరణ గలగల ద్వ్హానము
పక్షుల, నవ్వుల కిలకిలారావము
యుద్ధోన్మత్తుల శంఖారావము
వీనుల విందుగా వినుచు నిలచెను
హనుమ ఆనందమును వ్యక్త పరచుచు 13

రావణ దూతలను, గూఢ చారులను
రాక్షస సైన్యములు, రాజ మార్గమును
వీధుల కూదళ్ళు, వింత భవనములను
హనుమ చూసెను అచ్చెరువొందుచు 14

వివిధ వృత్తులలో నిపుణులను
జడధారులను, సప్త సిరులను
ఆవు చర్మమును కట్టు వారలను
వివిధ రకముల వస్త్ర ధారులను 15
"కుశ"లను అస్త్రము చేయు వారలను
నిప్పునే ఆయుధముగ వాడు వారలను
సుట్టి, కొడవలి పట్టిశ ధారులను
ఎకాక్షులను, ఎక కర్ణులను 16
బాన పొట్టలును, జారిన వక్షులను
విచిత్రాకృతులను, వంకర మూతులను
విల్లు ధారులగు మరగుజ్జు వీరులను
కత్తులు, అంబులు, బల్లెము, పరిఘలు 17
విచిత్ర ఆయుధములు వాడు నేర్పరులను
స్థూల కాయులను, సూక్ష్మ కాయులను
పొడుగును పొట్టియు కాని వారలను
తెల్లటి తెలుపును, నల్లటి నల్లుపును 18
చామన చాయతో మెరుయు వీరులను
గూని వారలను, మడ్డి వారలను
మంచి తెలివితో వెలుగు వారలను
ద్వ్హజములు ధరించి తిరుగు వారలను 19
వివిధాయుధములు వాడు వారలను
అమిత శక్తితో నడచు వారలను
చెట్లను ఆయుధము చేయు వారలను
ఉరుములు మెరుపుల ఆయుధ ధారులను 20
వడిసెలు, ఉండేలు వాడు వారలను
పూల హారములు చేయు వారునూ
గంధపు లేపన ద్రినిచు వారలను
వివిధాలంకార ప్రియులగు వారును 21
ఏమియు ధరించక తిరుగు వారును
నిసిత సూలములతో పొడుచు వారును
విస్మయముతో ముందుకు సాగెను
సీతకై వెదుకుచు హనుమ నెమ్మదిగ 22

నగర మధ్యనకు చేరెను హనుమ
ముందుకు చూసెను, విస్మయమందెను
రావణ ఆజ్ఞకై వేచి వుండెడి
నూరు వేల సైన్యము చూసెను 23

బంగరు దారులతో, పద్మములు నిండిన
రాజ మార్గములతో, అతి పటిష్టమౌ
ప్రహరీ గోడతో, కొండపై నిలచిన
సుందరమగు రావణ మందిరమును,
మరి మరి చూసెను మారుతి ఆశ్చర్యమున 2425

మేటి అశ్వముల శకలింపులతో
వివిధాభరణముల గలగలలతో
రధ గజ తురగ పదాది దళముల
రణగొణ భీషణ ఘోషలతో 26
భూచర ఖేచర వాయుచర
వాహన సంచిత ద్వనులతో
వివిధాలంకృత గజాస్వములతో
నాలుగు దంతముల ఏనుగులతో 27
అద్భుత సుందర హార్మ్యములతో
బంగారు పూతల రహదారులతో
ముత్యము మణులు పొదిగిన చావళ్ళతో
సుగంధ ద్రవ్య కళ్ళపులతో 28
వేలకొలది రక్షక భటులతో
రంక్షించ బడు లంకలో
హనుమ చీకటి మాటున ప్రవేసించెను 29